ఆ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పులు...

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (16:23 IST)
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు భారత ఎన్నకల సంఘం ఈ మేరకు ఆదివారం అధికారికంగా ఓ ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన కాకుండా, జూన్ 2వ తేదీని లెక్కించనున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. కేవలం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రమే ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. 
 
మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్.. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ పోలింగ్ 
 
దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలకు కూడా మే నెల 13వ తేదీనే పోలింగ్ నిర్వహిస్తారు. 
 
లోక్‌సభ ఎన్నికలు ఇలా... 
 
తొలి దశ : ఏప్రిల్ 19వ తేదీన 102 లోక్‌సభ స్థానాలకు (21 రాష్ట్రాలు) 
రెండో దశ : ఏప్రిల్ 26వ తేదీ, 89 ఎంపీ స్థానాలు (13 రాష్ట్రాలు) 
మూడో దశ : మే 7వ తేదీ, 94 స్థానాలు (12 రాష్ట్రాలు) 
నాలుగో దశ : మే 13వ తేదీ, 96 ఎంపీ స్థానాలు (10 రాష్ట్రాలు) 
ఐదో దశ : మే 20వ తేదీ, 49 స్థానాలు (8 రాష్ట్రాలు) 
ఆరో దశ : మే 25వ తేదీ, 57 స్థానాలు (7 రాష్ట్రాలు) 
ఏడో దశ : జూన్ 1వ తేదీ 57 స్థానాలు (8 రాష్ట్రాలు) 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments