Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబరు నెలాఖరులోపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Advertiesment
election commission of india
, ఆదివారం, 25 జూన్ 2023 (13:21 IST)
ఈ యేడాది ఆఖరు నాటికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే, ఈ ఎన్నికలను డిసెంబరు ఏడో తేదీలోపు నిర్వహించేందుకు అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం సంబంధించి రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించిన ఈసీ బృందం... ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తుంది. నిర్దిష్ట సమయం ప్రకారం సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. దీంతో గత ఎన్నికల కంటే ముందే అంటే డిసెంబరు 7వ తేదీలోపు ఈ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
 
రాష్ట్రంలో పర్యటించిన ఎన్నికల బృందంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, ఆర్కే గుప్తా, సంజయ్ కుమార్, అండర్ సెక్రటరీ అవినాశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ హిర్దేశ్ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. ఈ బృందం మూడు రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చింది. 
 
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కలెక్టర్లు, ఐటీ, పోలీసు ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించింది. ఎన్నికల కమిషన్ కొత్తగా తీసుకొచ్చిన సాంకేతికత, కొత్త అప్లికేషన్ వాడకంపై అదికారులకు అవగాహన కల్పించినట్టు సమాచారం. 
 
ఓటర్ల జాబితా, నోటిఫికేషన్, ఎన్నికల కోడ్, పోలీస్ చెక్ పాయింట్ల ఏర్పాటు, ఈవీఎంల భద్రత తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఈసీ బృందం చర్చించింది. అదేవిధంగా ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా, మూడేళ్లు ఒకేచోట ఉన్న అధికారుల బదిలీలు తొందరగా చేపట్టాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో మూడు రోజుల వర్షాలు