Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోంలో కరోనా వైరస్ విజృంభణ.. 94వేలకు పైగా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (21:59 IST)
కరోనా వైరస్ అసోంలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 94వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తరుణ్‌ గొగొయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. 85 ఏళ్ల గొగోయ్‌ బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. 
 
అసోంలో బుధవారం ఒక్కరోజే 1973 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,592కి చేరింది. వీరిలో 74,814 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 260మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 19518 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
 
గత కొద్ది రోజులుగా తనను కలిసినవారు తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల నుంచి స్వల్పంగా దగ్గు, జలుబు ఉన్నట్టు సమాచారం. గొగోయ్‌కి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు పార్టీ నేతలు తెలిపారు.
 
వయస్సు రీత్యా అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకొని ఆస్పత్రిలో చేరుస్తామని అన్నారు. గొగొయ్‌కి కరోనా సోకడంపై రాష్ట్ర వైద్య శాఖామంత్రి హిమంత బిశ్వశర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments