Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా చేపలపై బీహార్ నిషేధం... నితీశ్‌కు చంద్రబాబు లేఖ

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (15:39 IST)
బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా చేపలపై బీహార్ సర్కారు 15 రోజుల పాటు నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్‌కు సరఫరా అవుతున్న చేపల్లో ఫార్మాలిన్ అనే రసాయన పదార్థం ఉందని పేర్కొంటూ బీహార్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం స్పందించారు. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. ఆంధ్రా చేపల ఉత్పత్తులపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై గుర్తించి తగిన చర్యలు తీసుకుని, ఇరు రాష్ట్రాల మధ్య చేపల వాణిజ్యాన్ని పునరుద్ధరించేందుకు వీలుగా ఓ టెక్నికల్ కమిటీని పంపించాలని కోరారు. 
 
ఈ నిషేధం విధించడానికి ముందు తమ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తాము జరిపిన తనిఖీల్లో ఎలాంటి ఫార్మాలిన్‌ను గుర్తించలేదని వెల్లడించారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నాణ్యతా ప్రమాణ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. కాగా, చేపలను నిల్వ చేసేందుకు ఫార్మాలిన్‌ను ఉపయోగిస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments