Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రికి సారీ చెప్పిన ఢిల్లీ సీఎం.. ఎందుకు?

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు.

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (15:11 IST)
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురు ఆప్ నేతలు కూడా జైట్లీకి సారీ లేఖలు పంపిన వారిలో ఉన్నారు. 
 
తాజాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. దీంతో జైట్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో జైట్లీకి సారీ చెపుడూ కేజ్రీవాల్ ఓ లేఖను రాశారు. 
 
తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు జైట్లీ తన కేసును వెనక్కి తీసుకునే అవకాశముంది. అలాగే, నితిన్ గడ్కరీ కూడా తాను వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, కేజ్రీవాల్ వరుస సారీలపై ఆప్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలుత మాట జారడం ఆ తర్వాత సారీలు చెప్పడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిలకు కూడా ఆయన సారీ చెప్పే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments