సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్న రాజకీయ నేతలను విషమిచ్చి చంపాలని యురీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులు అంటున్నారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పీవోకేలోని ఉగ్రతాండాలపై మెరుపు
సర్జికల్ దాడులను ప్రశ్నిస్తున్న రాజకీయ నేతలను విషమిచ్చి చంపాలని యురీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులు అంటున్నారు. యురీ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పీవోకేలోని ఉగ్రతాండాలపై మెరుపుదాడి జరిపింది. ఈ దాడిలో అనేక తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ఈ దాడులపై విపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ దాడులను భారత సైన్య విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, దాడులను ప్రశ్నిస్తున్న పలువురు రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. సర్జికల్ దాడులు జరిపినట్టుగా రుజువు చేసే వీడియో ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి రాజకీయ నేతలకు విషం ఇచ్చి చంపాలని అంటున్నారు. సర్జికల్ దాడులు చేయాల్సింది ఉగ్రవాదుల మీద కాదు, ఇలాంటి నాయకుల మీద ముందు చేయాలని మండిపడ్డారు. సర్జికల్ దాడుల గురించి ప్రశ్నిస్తున్న నాయకులు దేశ ద్రోహులని ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతాదేవి అన్నారు.
సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయన్న విషయాన్ని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుల వల్లే ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడుతున్నారని ఆరోపించారు. మన సైనికుల నిబద్ధతను ప్రశ్నించడం ఎంతో బాధను కలిగిస్తోందని ఆమె వాపోయారు. నాయకుల మాటలు అమరుడైన సైనికుడి కుటుంబానికి ఎంతో ఆవేదన కలిగిస్తాయని తెలిపారు.