అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలిన చీతా హెలికాఫ్టర్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (15:07 IST)
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. భారత పదాతిదళానికి చెందిన చీతా హెలికాప్టర్‌ ఒకటి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తవాంగ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్‌ ఆర్మీ తెలిపింది. 
 
రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సైనిక బృందాలు ఇరువురు పైలట్లను సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.
 
అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ లెఫ్టినెంట్‌ కర్నల్‌ సౌరభ్‌ యాదవ్‌ చికిత్స పొందుతూ మరణించినట్లు పేర్కొంది. మరొకరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

P.G. Vinda: సినిమాటికా ఎక్స్ పో 3వ ఎడిషన్ లో AI సెషన్స్ వుంటాయి : పి.జి. విందా

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments