Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు కన్యనో కాదో చెప్పండి రేప్ జరిగితే ఉపయోగపడుతుంది.. అసుపత్రి నిర్వాకం

ఆ ప్రభుత్వ ఆసుపత్రి మనుషుల గౌరవానికి సంబంధించిన అన్ని విలువలనూ తోసి పడేసింది. వైద్య సంస్థలో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహస్థితి పత్రంలో మీరు కన్యో కాదో చెప్పండి అనే ఆప్షన్ ఉంచి నింపమనడం సంచలనం కలిగిస్తోంది. ఏమిటీ దారుణం అని అడిగిత

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (05:49 IST)
ఆ ప్రభుత్వ ఆసుపత్రి మనుషుల గౌరవానికి సంబంధించిన అన్ని విలువలనూ తోసి పడేసింది. వైద్య సంస్థలో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహస్థితి పత్రంలో  మీరు కన్యో కాదో చెప్పండి అనే ఆప్షన్ ఉంచి నింపమనడం సంచలనం కలిగిస్తోంది. ఏమిటీ దారుణం అని అడిగితే ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది.
 
ఏదైనా ఉద్యోగంలో చేరేముందు అభ్యర్థి వివాహ స్థితి గురించిన సమాచారాన్ని సంస్థ అడగడం మామూలే. బిహార్‌లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం ఉద్యోగంలో చేరేవారు కన్యనా కాదా అనే సమాచారాన్ని అడగడం పలువురి ఆగ్రహానికి కారణమవుతోంది. పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగంలో చేరేవారు నింపాల్సిన దరఖాస్తులోని వివాహ స్థితి పత్రంలోని ఓ సెక్షన్‌లో ‘నేను బ్రహ్మచారి వితంతువు కన్య’ అని ఉంది.
 
అలాగే ‘నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది’, ‘నాకు పెళ్లైంది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య లేదు’, ‘నేను పెళ్లి చేసుకున్న అతనికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది’ లాంటి వింత ఆప్షన్లు కూడా ఆ పత్రంలో ఉన్నాయి. అభ్యర్థి వీటిలో తనకు ఏది సరిపోలుతుందో దానిని టిక్‌ చేయాలి. వీటిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాట్లాడుతూ, ఉద్యోగులపై అత్యాచారాలు జరిగినప్పుడు కన్యనా, కాదా అనే సమాచారం ఉపయోగపడొచ్చని చెప్పడం మరింత వివాదానికి దారి తీసింది.
 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments