Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది వేలకు చూసుకున్నారు.. ఆరు కోట్లు కక్కమంటే ఖంగుతిన్నారు

ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడం మనకే అలవాటనుకుంటే అమెరికాలోనూ ఇదే తంతు నడుస్తోంది. రాతకోతలు ఉల్లంఘించి భారత్‌లో తప్పించుకోవచ్చు గానీ అమెరికాలో కుదరదు. అందుకే పెళ్లిఫొటోల ఆల్బమ్ కవర్ కోసం ఇవ్వాల్సిన 8 వేల రూపాయలకు కక్కుర్తి ప

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (03:49 IST)
ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించడం మనకే అలవాటనుకుంటే  అమెరికాలోనూ ఇదే తంతు నడుస్తోంది. రాతకోతలు ఉల్లంఘించి భారత్‌లో తప్పించుకోవచ్చు గానీ అమెరికాలో కుదరదు. అందుకే పెళ్లిఫొటోల ఆల్బమ్ కవర్ కోసం ఇవ్వాల్సిన  8 వేల రూపాయలకు కక్కుర్తి పడి ముందస్తు ఒప్పందాన్ని అతిక్రమించినందుకు కోర్టు ఆ దంపతులకు ఆరు కోట్ల రూపాయలు కట్టాల్సిందిగా తీర్పు చెప్పింది. అంత డబ్బు మావద్దలేదు. మేం కట్టలేమంటే జైలు గ్యారంటీ. 13 సంవత్సరాల ఫొటోగ్రాఫర్ వ్యాపారాన్ని, విశ్వసనీయతను ఒక్కరోజులో దెబ్బతీసినందకు శిక్ష ఇది.
 
వివరాల్లోకి వెళితే.. . అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఆండ్య్రూ, నీలీ మాల్దోవన్‌ 2014 అక్టోబర్‌లో పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుక ఫొటోలు తీసేందుకు ఆండ్రియా పొలిటో అనే ఫొటోగ్రాఫర్‌తో మాట్లాడుకున్నారు. పెళ్లి జరిగిన కొన్ని వారాల తర్వాత ఫొటోల కోసం నీలీ.. ఆండ్రియాకు ఈమెయిల్‌ చేసింది. ఫొటోలు పూర్తయ్యాయని.. అయితే ఆల్బమ్‌పై కవర్‌ ఫొటో కోసం ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుందని ఆండ్రియా చెప్పింది. ఇందుకు 125 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలు) అదనంగా ఖర్చవుతుందని తెలిపింది. 
 
అయితే ఆ డబ్బులు చెల్లించేందుకు నీలీ దంపతులు ఒప్పుకోలేదు. అయితే ఇది అగ్రిమెంట్‌లో ముందుగానే చెప్పామని ఆండ్రియా చెప్పింది. అగ్రిమెంట్‌ సరిగా చూసుకోని నీలీ దంపతులు ఆమెతో వాదనకు దిగారు. దీంతో ఆండ్రియా అదనపు డబ్బులు అవసరం లేదని చెప్పి.. ఫొటోలు రెడీ చేసింది. అయితే ఫొటోల గురించి నీలీ నుంచి ఎలాంటి మెయిల్‌ రాలేదు.
రెండు రోజుల తర్వాత నీలీ దంపతులు స్థానిక మీడియా ఛానల్‌లో రావడం చూసి ఆండ్రియా కంగుతింది. 
 
‘తమ పెళ్లి ఫొటోలను ఆండ్రియా తన దగ్గరే ఉంచుకుందని, ఇవ్వడం లేదని’ నీలీ దంపతులు మీడియా ద్వారా చెప్పారు. ఆండ్రియా తమను మోసం చేసిందని పేర్కొన్నారు. అటు లోకల్‌ మీడియా, ఇటు సోషల్‌మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో ఆండ్రియా వ్యాపారం డీలా పడింది. ఇలాగే ఉంటే లాభం లేదని భావించిన ఆండ్రియా.. 2015 మార్చిలో నీలీ దంపతులపై పరువు నష్టం దావా వేసింది. 13ఏళ్ల తన వ్యాపారాన్ని వారు ఒక్క రోజులో దెబ్బతీశారంటూ ఫిర్యాదు చేసింది. 
 
ఈ కేసులో గత శుక్రవారం తుది విచారణ పూర్తయింది.ఈ కేసులో ఆండ్రియాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పరువు నష్టం కింద నీలీ దంపతులు ఆమెకు 1.08మిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ. 6.9కోట్లు) కట్టాల్సిందేనని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుపై ఆండ్రియా హర్షం వ్యక్తం చేసింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments