Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో మాత్రమే డ్రగ్స్‌ దొరికాయా? : ఉద్ధవ్‌ ఠాక్రే

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:53 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే.. బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేయడంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో మాత్రమే డ్రగ్స్‌  దొరికాయా? ముంద్రా పోర్టులో పట్టుకున్న కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ సంగతి ఏంటని ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలు చిటికెడు గంజాయి పట్టుకుంటే, తమ పోలీసులు 150 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సెలెబ్రిటీలను పట్టుకోవడం వారితో ఫొటోలు దిగడంపైనే వారికి ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు.

భారతీయులందరి పూర్వీకులంతా ఒకరేనని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విపక్ష పార్టీలు, రైతుల పూర్వీకులు వేరే గ్రహం నుంచి వచ్చారా అని ప్రశ్నించారు.

ఈడీని దించి వేధించడం మానుకోవాలని, ఎదురుగా వచ్చి పోరాడాలని బీజేపీపై మండిపడ్డారు. దమ్ముంటే తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉద్ధవ్‌ ఠాక్రే సవాల్‌ విసిరారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments