Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా హజారే మళ్లీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు... ఎవరి కోసమో తెలుసా?

2011 సంవత్సరంలో అవినీతిపై పోరాడేందుకుగాను రామ్ లీలా మైదానంలో అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి హజారే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈసారి రైతుల సమస్యలపైన, లోక్ పాల్ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భం

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (16:19 IST)
2011 సంవత్సరంలో అవినీతిపై పోరాడేందుకుగాను రామ్ లీలా మైదానంలో అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి హజారే ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈసారి రైతుల సమస్యలపైన, లోక్ పాల్ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 
 
రాజకీయ నేతలు ఎవరూ మంచివాళ్లుగా లేరనీ, అంతా మోసగాళ్లేనని విమర్శించారు. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆమరణ దీక్షకు మద్దతుగా వచ్చేందుకు సిద్ధమైన వారిని ఇక్కడకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్ని ఎవర్నీ రానీయకుండా చేసిందని ఆరోపించారు. నా వద్దకు రాకుండా శాంతియుతంగా జరిగే దీక్షను హింసాత్మకం చేస్తారా అంటూ ప్రశ్నించారు. మద్దతుదారుల్ని ఆపడంతో ఆందోళన చెలరేగితే దానికి కారకులు మీరు కాదా అని ప్రశ్నించారు. 
 
దీక్ష చేస్తున్న నాకు రక్షణ అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పినా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. లోక్ పాల్ కోసం ఎన్ని డిమాండ్లు చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ వాళ్లు ఉరితీసిన రోజు అయిన మార్చి 23నే తాను దీక్షకు కూర్చుంటానని గతంలోనే హజారే ప్రకటించిన నేపధ్యంలో ఇవాళ ఆయన దీక్షకు దిగారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments