Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ భర్తతో అంజు ఎంజాయ్... కష్టాల్లో మొదటి భర్త ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (15:47 IST)
ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంజు అనే వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలు, కుటుంబాన్ని వదిలివేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంది. కానీ, భారత్‌లోని ఆమె మొదటి భర్త, ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం కష్టాలు ప్రారంభమయ్యాయి.
 
జాతీయ మీడియా కథనాల మేరకు... అంజు భర్త ఆయన పని చేస్తున్న సంస్థ ఉద్యోగంలో ఉంచినప్పటికీ ఎలాంటి పనులు కేటాయించకుండా బెంచ్‌కే పరిమితం చేస్తుంది. అలాగే ఆమె సోదరుడిని మాత్రం ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక అంజు తండ్రి టైలర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఇపుడు ఆయన వద్దకు చుట్టుపక్కలవారు ఎవరూ రావడం లేదు. ఎవరూ పని ఇవ్వడం లేదు. దీంతో ఆయన జీవనాధారాన్ని కోల్పోయారు. 
 
నిజానికి అంజు పాకిస్థాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె తండ్రిపై గ్రామస్తులు సానుభూతి చూపించారు. కానీ, ఎపుడైతే పాకిస్థాన్ ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా పాకిస్థాన్ వెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకుని స్థిరపడటంతో ఆమె కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. 
 
మరోవైపు, వివాహం తర్వాత అంజు తన పేరును ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. పైగా, ఆమెకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానీ భారీగా నగదుతో పాటు స్థలం కూడా ఇచ్చారు. ప్రస్తుతం అంజు తన పాక్ భర్తతో కలిసి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌, అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments