అంజూ సెటిలైపోయింది.. కానీ ఫ్యామిలీకి కష్టాలు..

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (12:17 IST)
Anju
ఫేస్‌బుక్ ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాకిస్థాన్ వెళ్లిన మహిళ అంజూ ప్రస్తుతం బాగా సెటిలైపోయింది. మతం మారి ఫాతిమాగా పేరు మార్చుకుని ప్రియుడిని పెళ్లాడింది. అయితే అంజూ కుటుంబం మాత్రం నానా తంటాలు పడుతోంది. 
 
అంజూ కుటుంబాన్ని మాత్రం ఇబ్బందులు చుట్టుముట్టాయి. అంజూ చేసిన పనికి తొలుత సానుభూతి వ్యక్తం చేసిన వారే ఇప్పుడు అనుమానంగా చూస్తున్నారు. అంజూ భర్త ఉద్యోగం ఊడింది. అంజూ భర్త పనిచేస్తున్న కంపెనీ ఆయనను ఇంటికే పరిమితం కావాలని, కంపెనీ పేరును బయట పెట్టొద్దని సూచించినట్లు సమాచారం. 
 
తాము పిలిచే వరకు ఆఫీసుకు రావొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అంజూ మరిదిని కూడా సమస్యలు వెంటాడుతున్నాయి. వదిన చేసిన పనికి ఆయన కూడా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. టైలర్‌గా పనిచేసే అంజూ తండ్రికి ప్రస్తుతం ఉపాధి లేకుండా పోయింది. 
 
భర్త, ఇద్దరు పిల్లలను వదిలి అంజూ ప్రియుడి కోసం వెళ్లడం, అక్కడ మతం మారి పెళ్లి చేసుకోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments