Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి పీఠాన్ని తిరస్కరించిన అంబికా సోని!

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (12:31 IST)
పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, గాంధీలకు విధేయురాలైన అంబికా సోని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. శనివారం అర్థరాత్రి ఆమెతో రాహుల్ గాంధీ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో భాగంగా అంబికకు రాహుల్ సీఎం పదవిని ఆఫర్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిక్కులే ఉండాలని, లేదంటే దాని వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె చెప్పినట్టు సమాచారం. పంజాబ్ హోషియార్ పూర్ జిల్లాకు చెందిన అంబికా సోని.. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
 
కాగా, తనను అడుగడుగునా అవమానిస్తున్న కోపంతో ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరితోనూ శనివారం సీఎల్పీ సమావేశం నిర్వహించారు. 
 
కాగా, పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధిపతులు సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బాజ్వా, బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్ బిట్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు పంజాబ్ పీసీసీ ప్రస్తుత చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ, సుఖ్జీందర్ సింగ్ రంధావా, త్రుప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా, బ్రహ్మ్ మహీంద్ర, విజయ్ ఇందర్ సింగ్ల, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాలూ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments