Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ రాజీనామా

Advertiesment
ముఖ్యమంత్రి సలహాదారుగా ప్రశాంత్ కిషోర్ రాజీనామా
, గురువారం, 5 ఆగస్టు 2021 (13:10 IST)
పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా చేశారు. ప్రజా జీవితంలో పోషించిన చురుకైన పాత్ర నుండి తాత్కాలిక విరామం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 
 
అమరీందర్‌ సింగ్‌కు రాసిన లేఖలో... తన తదుపరి చర్యల గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. 'మీకు తెలిసినట్లుగా.. ప్రజా జీవితంలోని క్రియాశీల పాత్ర నుండి కొంత విరామం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ మేరకు మీ ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వర్తించలేను. అదేవిధంగా భవిష్యత్తులో చేపట్టే కార్యాచరణపై కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. నా బాధ్యతల నుండి తప్పిస్తారని ఈ లేఖ రాస్తున్నాను' అని పేర్కొన్నారు. 
 
వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రశాంత్‌ చర్య.. ముఖ్యమంత్రిని నైరాశ్యంలోకి నెట్టినట్లైంది. సిద్దుతో విబేధాలు పొడిచూపిన సమయంలో.. మార్చిలో ప్రశాంత్‌ కిశోర్‌ను ప్రధాన సలహాదారుగా అమరీందర్‌ నియమించుకున్నారు. 
 
అయితే ప్రశాంత్‌ కిశోర్‌ సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం ఆయన చూపంతా 2024 సార్వత్రిక ఎన్నికలు, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పైనే కేంద్రీకరించినుట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామాచేశారని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధ్యప్రదేశ్‌లో వరదలు.. మొరాయించిన బోటు.. మంత్రిని అలా కాపాడారు..