Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ఓవరాక్షన్.. చెప్పులపై గాంధీజీ బొమ్మ.. నెటిజన్ల ఫైర్.. రచ్చ రచ్చ

అమేజాన్ తన అమెరికా వెబ్‌సైట్‌లో మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన చెప్పులను అమ్మకానికి పెట్టింది. దీనిని గుర్తించిన పలువురు వినియోగదారులు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (17:43 IST)
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) క్యాలెండర్, డైరీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బొమ్మను ముద్రించడం వివాదాస్పదమైంది. దీనిపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చరఖా ముందు కూర్చొని నూలు వడుకుతున్నట్టు ఫోజు ఇచ్చినంత మాత్రాన గాంధీ కాలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ఇలా ఫోజు ఇవ్వడం గాంధీని అవమానించడమేనని అన్నారు.
 
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, గాంధీజీ జాతి పిత అని, మరి మోడీజీ ఎవరని ప్రశ్నించారు. ఈ వివాదంపై ఇంకా రాజుకున్న అగ్గి చల్లారక ముందే.. అమేజాన్ సంస్థ గాంధీ ఫోటోలతో కూడిన చెప్పులను తయారు చేసి.. వాటిని వెబ్ సైట్లో పెట్టి తప్పు చేసింది. 
 
ప్రముఖ ఆన్‌లైన్ విక్రయాల సంస్థ అమేజాన్ చేసిన ఈ ఘటనతో పలువురు ఫైర్ అవుతున్నారు. అమేజాన్ తన అమెరికా వెబ్‌సైట్‌లో మహాత్మాగాంధీ బొమ్మతో కూడిన చెప్పులను అమ్మకానికి పెట్టింది. దీనిని గుర్తించిన పలువురు వినియోగదారులు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే అమెజాన్ కెనడా అమ్మకాల్లో జాతీయ జెండాను పోలిన డోర్‌మ్యాట్‌లను విక్రయానికి పెట్టిందని, దీనిపై హెచ్చరించినప్పటికీ తాజాగా గాంధీ బొమ్మతో తయారు చేసిన చెప్పులను అమ్మకాలకు ఉంచిందని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. 
 
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సుష్మా స్వరాజ్ అమెరికాలోని భారత రాయబారిని ఆదేశించారు. దీనిపై సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం గాంధీజీ ఫోటోలతో కూడిన చెప్పులు నెట్లోకి వచ్చేశాయి. వీటిని షేర్ చేసే వారి సంఖ్య, జాతిపితకు అవమానం జరిగిందని మండిపడే వారి సంఖ్య అధికమవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ రచ్చ జరుగుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments