Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్నాథ్ యాత్రలో విషాదం : ఒక్కరోజే గుండెపోటుతో మృతి

Webdunia
బుధవారం, 12 జులై 2023 (17:09 IST)
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఒక్క రోజే ఐదుగురు గుండెపోటుతో మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ఐదుగురు యాత్రికులు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. వీరి మృతికి గుండెపోటే కారణమని వారు తెలిపారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో జరిగే ఈ యాత్రకు వెళ్లిన వారిలో ఈ ఏడాది మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరినట్టు అధికారులు వెల్లడించారు.
 
తాజాగా మృతి చెందిన ఐదుగురిలో అనంతనాగ్‌ జిల్లాలోని పెహల్గాం మార్గంలో ముగ్గురు.. గాందర్‌బల్‌ జిల్లా బల్తాల్‌ మార్గంలో ఇద్దరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు, మధ్యప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉండగా.. ఇంకో వ్యక్తి వివరాలను గుర్తించాల్సి ఉందని తెలిపారు.
 
ఇటీవల అమర్‌నాథ్‌ యాత్ర విధులకు వెళ్లిన ఓ ఐటీబీపీ అధికారి ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ యాత్ర మొదలైనప్పట్నుంచి మొత్తం మృతుల సంఖ్య 19కి చేరింది. అమర్‌నాథ్ యాత్రికులు, విధులకు వెళ్లిన భద్రతా సిబ్బంది మరణానికి కారణం అక్కడి అసాధారణ పరిస్థితులే అని అధికారులు చెబుతున్నారు. 
 
అధిక ఎత్తులో ఆక్సిజన్‌ గాఢత తక్కువగా ఉండటం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మంగళవారం వరకు అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని 1,37,353 మంది యాత్రికులు సందర్శించారని అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర జులై 1 నుంచి మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ఉక్కు సత్యాగ్రహం ఇన్ స్పైరింగ్ గా ఉంది : సీబీఐ మాజీ వీవీ లక్ష్మి నారాయణ

నాకు మరిన్ని మంచి లవ్ స్టోరీస్ రాబోతున్నాయి : మిస్ యు హీరో సిద్ధార్థ్

Pushpa 2: The Rule నటుడు శ్రీతేజ్ పెళ్లి చేసుకుంటానని మోసం: యువతి ఫిర్యాదు

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments