ఇటీవలికాలంలో గుండెపోటుతో హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య పెరిగిపోతున్నాయి. ఈ జాబితాలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి వైద్యుల బృందం ఒక పరిశోధన చేసింది. ఇందులో గుండెపోటుకు ప్రధాన కారణాన్ని గుర్తించింది. గుండెపోటుకు ప్రధాన కారణం ఒత్తిడేనని తేలింది. తాజాగా జరిగిన ఈ పరిశోధనా ఫలితాలను ఇండియన్ హార్ట్ జర్నల్ ప్రచురించింది.
హృద్రోగ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రోగులపై జీబీ పంత్ ఆసుపత్రి వైద్యుల బృందం అధ్యయనం చేసింది. తీవ్రమైన, స్వల్ప గుండెపోటుతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన 903 మంది రోగుల ఆరోగ్య పరిస్థితిని నెల రోజుల పాటు శాస్త్రీయ పద్ధతిలో వైద్యులు పరిశీలించారు. రోగులలో మొత్తం 92 శాతం మంది ఒత్తిడితో బాధపడుతున్నట్లు తేలిందని చెప్పారు.
వీరిలో కొంతమంది అధిక ఒత్తిడితో మరికొందరు స్వల్ప స్థాయి ఒత్తిడితో బాధపడుతున్నారని తేల్చారు. మరీ ముఖ్యంగా ఒత్తిడితో బాధపడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉందని వివరించారు. మారుతున్న జీవనశైలి వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలామంది ఒత్తిడితో బాధపడుతున్నారని, ఈ ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ మోహిత్ గుప్తా వెల్లడించారు.
గుండె పనితీరుపై ఒత్తిడి తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆయన వివరించారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో ఎక్కువ మంది అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫారెక్షన్ (తీవ్రమైన గుండెపోటు)కు గురైనట్లు చెప్పారు. ఇందులో 53 శాతం సివియర్ హార్ట్ ఎటాకు గురికాగా, 38 శాతం ఓ మోస్తరు గుండెపోటుకు గురైనట్లు పేర్కొంది. ఒత్తిడికి తద్వారా హృద్రోగ సమస్యలు పెరగడానికి ధూమపానం, మద్యపానం, వ్యాయామం లేకపోవడం, బీపీ, ఇన్సులిన్ తగ్గడం తదితర కారణమని ప్రొఫెసర్ డాక్టర్ మోహిత్ గుప్తా