మసాలా టీ. ఈ టీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. సాధారణ టీ కంటే మసాలాను జోడించడం ద్వారా టీ రుచిని పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము. ఈ టీ మసాలా చేసేందుకు అన్ని పదార్థాలు ప్రతి ఒక్కరి వంటగదిలో అందుబాటులో ఉంటాయి.
దీని కోసం 10 లవంగాలు, 12 ఏలకులు, 7 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల సోంపు అవసరం.
1 అంగుళం దాల్చిన చెక్క, 1 అంగుళం పొడి అల్లం, 7-8 తులసి ఆకులు కూడా అవసరం. పైన తెలిపిన ఈ మసాలా దినుసులన్నింటినీ 2 నిమిషాలు పొడిగా సెగపైన వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
చాయ్ మసాలా గరంగరంగా చేసుకునేందుకు పొడి సిద్ధం, దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ప్రతి కప్పు చాయ్ కోసం ¼ టీస్పూన్ ఈ చాయ్ మసాలా కలుపుకోవాలి.