Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి వైన్ మాత్రమే తీసుకుంటారు.. ఢిల్లీ పత్రికల ఓవరాక్షన్..

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టులో శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ నమూనాలున్నట్లు వెల్లడి అయ్యింది. కానీ శ్రీదేవి అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటారని.

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (20:32 IST)
అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మృతిపట్ల ఫోరెన్సిక్ రిపోర్ట్ విడుదలైంది. ఈ రిపోర్టులో శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ నమూనాలున్నట్లు వెల్లడి అయ్యింది. కానీ శ్రీదేవి అప్పుడప్పుడు వైన్ మాత్రమే తీసుకుంటారని.. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని మాజీ ఎంపీ అమర్ సింగ్ చెప్పారు. శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తరలించే అంశంపై దుబాయ్ షేర్ అల్ నహ్యాన్‌తో మాట్లాడినట్లు అమర్ సింగ్ చెప్పారు. అన్నీ పనులు పూర్తయ్యాక శ్రీదేవి పార్థివదేహాన్ని భారత్‌కు పంపిస్తామని చెప్పినట్లు అమర్ సింగ్ వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. ఉత్తరాది, దక్షిణాది వ్యత్యాసాలు శ్రీదేవి విషయంలో స్పష్టమైనాయి. దక్షిణాదిలో శ్రీదేవి ఎంతో పేరు తెచ్చుకున్నా.. దక్షిణాది చిత్రాల గురించి ఢిల్లీ పత్రికలు ప్రస్తావించలేదు. శ్రీదేవి మరణ వార్తతో జాతీయ, అంతర్జాతీయ ఛానెళ్లు, పత్రికలు మార్మోగుతున్న తరుణంలో.. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమాల్లో శ్రీదేవి నటించిన సినిమాల గురించి ఢిల్లీ పత్రికలు ప్రస్తావించకపోవడం బాధాకరమని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
ఈ విషయమై ఆంగ్ల జర్నలిస్టు జక్కా జాకోబ్ స్పందించారు. ఢిల్లీకి చెందిన ఏ వార్తా పత్రికలోనూ శ్రీదేవి నటించిన దక్షిణాది సినిమాల గురించి వెల్లడించకపోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషా చిత్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న తర్వాతే శ్రీదేవి బాలీవుడ్‌కి వెళ్లారనే విషయాన్ని ఢిల్లీ పత్రికలు మరిచిపోయానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై దక్షిణాది నటి ఖుష్భూ స్పందించారు. ఇదే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని.. తన ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇదిలా ఉంటే.. శ్రీదేవి మృతిపై దుబాయ్ వైద్యులు ప్రాథమిక నివేదిక మాత్రమే ఇచ్చారని భారత పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీదేవి మృతి ప్రమాదామా లేక కుట్ర, ఆత్మహత్య అనే విషయం పూర్తి స్థాయి నివేదికలోనే వెల్లడవుతుందని, కెమికల్, విస్రా విశ్లేషణ ద్వారా ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారిస్తారని భారత పోలీస్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments