Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతీ యువకులు నచ్చిన వారితో కలిసి జీవించవచ్చు..

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (12:10 IST)
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని.. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన పూజా అలియాస్‌ జోయా, షావెజ్‌ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆచూకీ కనిపెట్టిన పూజా కుటుంబ సభ్యులు వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులు ఇద్దరినీ తమ ఎదుట హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది.
 
జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు. భర్తతోనే కలిసి ఉంటానని ఆమె చెప్పడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు ఉందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments