Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యువతకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉంది: అలహాబాద్ హైకోర్టు

యువతకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉంది: అలహాబాద్ హైకోర్టు
, మంగళవారం, 3 నవంబరు 2020 (10:56 IST)
యువతీయువకులకు తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు ఉందని అలహాబాదు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షహరాన్పూర్‌కు చెందిన పూజా అలియాస్ బోయా షావెజ్‌లు ప్రేమించుకున్నారు.
 
వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరని ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారిని వెతికి పట్టుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరిని ఓ గదిలో నిర్భంధించారు. అయితే వారు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం మేజర్లమని, తమకు కలిసి జీవించే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
 
ఈ ఫిటిషన్ పైన విచారణ చేపట్టిన న్యాయస్థానం యువతీయువకులను  తమ ఎదుట హాజరుపరచాలని తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చని తెలిపారు. నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీయువకులకు ఉందని స్ఫష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూఢిల్లీ నుంచి వుహాన్ వెళ్లిన వారికి కరోనా - భారత్‌లో కొత్తగా 38 వేల కేసులు