Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవివాహితులు, వివాహితులు అబార్షన్లు చేయించుకోవచ్చు, సుప్రీం కోర్టు తీర్పు

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (13:10 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అబార్షన్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహిత అయినా అవివాహిత మహిళ అయినా అబార్షన్ చేసుకునే వీలుంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. 
 
ప్ర‌తీ మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో గురువారం ఈ వ్యాఖ్య‌లు చేసింది. 
 
దేశంలో జరుగుతున్న అబార్షన్లలో 60 శాతం సురక్షితం కాదు. సురక్షితమైన అబార్షన్ సేవలకు నిరాకరించడం ద్వారా, నిర్బంధ అబార్షన్ పద్ధతులు అసురక్షితానికి దారితీస్తాయని అభిప్రాయ‌ప‌డింది. 
 
ఇక‌, లైంగిక వేధింపులు లేదా అత్యాచారం నుంచి బయటపడిన వారిలో వివాహిత స్త్రీలు కూడా ఉండొచ్చ‌ని కోర్టు వెల్లడించింది. ఒక స్త్రీ తన భర్తతో ఏకాభిప్రాయం లేని శృంగారం ఫ‌లితంగా గర్భవతి కావచ్చు. 
 
వివాహిత భాగస్వామి ద్వారా కూడా ఒక మహిళ అత్యాచారానికి పాల్పడినట్లు క్లెయిమ్ చేస్తే అబార్షన్ కోసం అత్యాచారం ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిన అవసరం లేదని కోర్టు తెలిపింది. 
 
ఇక తాజా తీర్పు వివరాల ప్రకారం ఎంపీటీ చట్టం ప్రకారం అవివాహిత స్త్రీలకు అబార్షన్ చేసుకునే హక్కు ఉంది. భారతదేశంలో అబార్షన్ చట్టం ప్రకారం వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య ఎటువంటి భేదం చూపదు. 
 
20-24 వారాల గర్భంతో ఉన్న ఒంటరి లేదా అవివాహిత గర్భిణీలను అబార్షన్‌కు అనుమతించకుండా నిషేధించడం, కేవ‌లం వివాహిత మహిళలనే అనుమతించడం అనేది ఆర్టికల్ 14 మార్గనిర్దేశక స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని కోర్టు తన తీర్పులో వెలువరించింది. 
 
చ‌ట్టం ఎప్పుడూ స్థిరంగా ఉండ‌కూడ‌ద‌ని, మారుతున్న సామాజిక వాస్త‌వాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం అభిప్రాయ‌ప‌డింది. 
 
వైవాహిక అత్యాచారం కూడా అబార్షన్ల విషయంలో అత్యాచారంగానే భావించాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. అలాగే, అసురక్షిత గర్భస్రావాలపై ఆందోళన వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం