తెలంగాణలో మరోసారి వర్షాలు.. హైదరాబాదుకు ఎల్లో అలెర్ట్

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2022 (12:53 IST)
తెలంగాణ మరోసారి వర్షాలు ప్రజలను ఇబ్బంది పెట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చ‌రించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది
 
అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాజ‌ధాని న‌గ‌రంలో రెండు రోజుల నుంచి వ‌ర్షాలు కురు‌స్తున్నాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌సారిగా వ‌చ్చిన వ‌ర్షంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డ్డారు. 
 
గురువారం రాత్రి కూడా ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ముఖ్యంగా హయత్ నగర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సరూర్ నగర్, కాప్రా ప్రాంతాల్లో భారీ వ‌ర్షంతో ఆ ప్రాంతాల‌న్నీ జ‌ల‌మయం అయ్యాయి. 
 
రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కూడా గురువారం వ‌ర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డి నలుగురు చ‌నిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగు పాటుకు ఇద్ద‌రు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments