Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తేసిన బీజేపీ... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (13:51 IST)
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేతులెత్తేసింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించే విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
తొలుత బీజేపీకి ఆహ్వానం పంపగా, ఆ పార్టీ నిరాకరించింది. ఇపుడు శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు అహ్వానించారు. ఒకవేళ ఆ పార్టీ కూడా చేతులు ఎత్తేస్తే ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, రాజ్యాంగ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అహ్వానిస్తారు. ఒకవేళ వీరిద్దరిలో ఎవరూ ముందుకు రాకుంటే రెండో అతిపెద్ద పార్టీని లేదా కూటమిని ఆహ్వానిస్తారు. 
 
ఆహ్వానం మేరకు వచ్చిన పార్టీ లేదా కూటమిని అసెంబ్లీలో బలనిరూపణలో గెలువగలరా? అని గవర్నర్‌ అడుగుతారు. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటములుగానీ, ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడిన పార్టీలుగానీ ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నామని లిఖితపూర్వకంగా గవర్నర్‌కు రాసిఇవ్వాల్సి ఉంటుంది. 
 
ఒకవేళ ఏ పార్టీగానీ, కూటమిగానీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేకుంటే అప్పుడు గవర్నర్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి నివేదిక పంపుతారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది. సిఫారసును రాష్ట్రపతి ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments