Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివసేనకు సీఎం... ఎన్సీపీ - కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం : ఉద్ధవ్ ఠాక్రే

Webdunia
సోమవారం, 11 నవంబరు 2019 (13:44 IST)
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అంగీకరించకపోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 56 సీట్లు కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపింది. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తహతహలాడుతున్న శివసేన ఉన్నతస్థాయి సమావేశం సోమవారం నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి పదవిని శివసేనకు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు, ఈ సమావేశం అనంతరం శివసేన నేతలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలో మధ్యాహ్నం గవర్నర్‌తో మరోసారి భేటీ కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని శివసేన గవర్నర్‌ను కోరనున్నది. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం శివసేనకు లేకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కానీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. కాంగ్రెస్‌తో చర్చించాకే తమ నిర్ణయం చెప్తామని వారికి తెలిపారు. దీంతో సందిగ్దంలో పడిన శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరనున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం