Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖేష్ అంబానీ ఇంట్లో మరో పెళ్లి సందడి...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:27 IST)
ముఖేష్ అంబానీ ఇంట్లో మరో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గత డిసెంబర్ 12వ తేదీన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహాన్ని ముంబైలో అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీకి, ప్రముఖ వ్యాపారవేత్త రస్సెల్ మెహతా కుమార్తెకు వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. కాగా ఈ పెళ్లి ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించారు.
 
మార్చిలో ఆకాష్ వివాహం జరగనుండగా అంబానీ దంపతులు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లి తొలి శుభలేఖను స్వామికి అందజేసారు. నీతా, ముఖేష్ అంబానీలు పెళ్లి కొడుకు ఆకాష్‌తో సిద్ధి గణపతి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి, శుభలేఖను స్వామివారి పాదాలచెంత ఉంచారు.
 
ఇషా అంబానీ పెళ్లిని తమ స్వంత ఇంటిలో చేసిన ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ పెళ్లి మాత్రం జియో వరల్డ్ సెంటర్‌లో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి ఏర్పాట్లు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments