Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ఐవీఆర్
సోమవారం, 23 జూన్ 2025 (23:48 IST)
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం జరిగి కనీసం 15 రోజులు కూడా కాలేదు. ఇంకా చాలా కుటుంబాలు విమాన ప్రమాదంలో మరణించిన తమవారి ఆచూకి తెలిపే డిఎన్ఎ రిపోర్టులు సరిపోలడంలేదు. చాలా కుటుంబాలు తమ ప్రియమైన వారిని చివరిసారిగా చూడలేకపోయాయి. ఇంకా అనేక మృతదేహాలను అప్పగించలేదు.
 
ప్రమాదంలో మరణించినవారి ఇళ్లలో తీవ్ర విషాదం అలుముకుని వుంది. అంత్యక్రియలు కూడా జరిపించేందుకు తమవారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు కూడా లభించలేదు. ఇలాంటి సమయంలో ఈనెల 20న, ఎయిర్ ఇండియా SATS SVP సంప్రీత్ కోటియన్, COO అబ్రహం జకారియా కార్యాలయంలో డిజె పార్టీని నిర్వహించారు. ఎంతో సంతోషంగా చిందులేస్తూ పార్టీ చేసుకున్నారు. ఆ రోజు కంపెనీ CFO కూడా అక్కడే ఉన్నారు.
 
ఒకవైపు ఘోర విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి డీజే పార్టీలు చేసుకుంటూ చిందులు వేయడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వీడియో వైరల్ కావడంతో ఏఐసాట్ అధికారులు స్పందించారు. ఇదేదో కావాలని చేయలేదని, రెండు కంపెనీలకు చెందిన అధికారులు సమావేశం జరిగినప్పుడు అనుకోకుండా అలా అయిపోయిందనీ, ఈ వీడియో విషయం మా దృష్టికి వచ్చిందనీ, దీనిపట్ల తీవ్రంగా చింతిస్తున్నామంటూ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments