Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టిన విమానం... ప్రయాణికులు పరిస్థితి?

Air India
Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా సేఫ్టీ వాల్‌ (ప్రహరీగోడ)ను విమానం ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ఏ ఒక్కరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి 1.30 గంటల సమయంలో జరిగింది.
 
తిరుచ్చి నుంచి దుబాయ్‌కు ఎయిరిండియా విమానం ఒకటి గురువారం రాత్రి 1.30 గంటల సమయంలో బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అవుతుండగా రెండు చక్రాలు ఏటీసీ ప్రహరీగోడను ఢీకొట్టుకుంటూ వెళ్లిందని, ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో ఉదయం 5.39 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
విమానంలో ఆరుగు సిబ్బంది, 130 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 136 మంది ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానం గోడను ఢీకొట్టిన తర్వాత కొంతసేపు ఎటీఎస్ సిగ్నల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు విమానం ముంబైలో ల్యాండైనట్టు చెప్పారు. ముంబై నుంచి మరో విమానంలో ప్రయాణికులను దుబాయ్‌కు పంపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments