Webdunia - Bharat's app for daily news and videos

Install App

తైక్వాండో నేర్చుకోనున్న వైద్యులు... ఇకపై వైద్య కోర్సులో మార్షల్ ఆర్ట్స్‌ను తప్పనిసరి చేస్తారా..

దేశవ్యాప్తంగా వైద్యులపై రోగులు, రోగుల బంధువుల దాడులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మే 15 నుండి ప్రతి రోజు రాత్రి 7 న

Webdunia
గురువారం, 4 మే 2017 (11:05 IST)
దేశవ్యాప్తంగా వైద్యులపై రోగులు, రోగుల బంధువుల దాడులు ఎక్కువైపోతున్న నేపథ్యంలో ఎయిమ్స్‌లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్‌డిఎ) ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  మే 15 నుండి ప్రతి రోజు రాత్రి 7 నుండి 8 వరకు 1500 మంది వైద్యులకు ఒక్కో బ్యాచ్‌లో 100 మంది చొప్పున జింఖానా క్లబ్‌లో తైక్వాండో శిక్షణను ఇవ్వనుంది. 
 
ఎమర్జెన్సీ మరియు అవుట్‌పేషెంట్ విభాగాల్లో రోగుల బంధువులు వైద్యులపై దాడులు పెరిగిపోతున్న సంగతి విదితమే. వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోమని పలు అభ్యర్థనలు చేసామని, ఆర్‌డిఎ వైద్యులకు ఆత్మరక్షణ తరగతులను నిర్వహించమని ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ను కోరినట్లు ఎయిమ్స్ ఆర్‌డిఎ అధ్యక్షులు విజయ్ గుర్జార్ తెలిపారు. 
 
వైద్యులపై దాడులు జరిగిన సందర్భంలో మహారాష్ట్రలోని దాదాపు 3 వేల మంది వైద్యులు ఐదు రోజులపాటు స్ట్రయిక్ చేసారు. వీరికి మద్దతుగా ఎయిమ్స్ ఆర్‌డిఎ వైద్యులు సైతం హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తించారు. అలాగే ఢిల్లీలోని ప్రభుత్వాసుపత్రుల్లోని వైద్యులు ఒకరోజు మూకుమ్మడిగా సెలవు పెట్టేసారు. 
 
ఇప్పుడు తాజాగా ఈ ఆత్మరక్షణ తరగతుల నేపథ్యంలో ఇకపై ఎంబిబిఎస్ లేదా ఆపై కోర్సుల్లో తైక్వాండో, కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్‌ను తప్పనిసరి సబ్జెక్ట్‌గా చేయవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments