Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావన తరహాలో గాయనిపై ఓలా క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం.. కానీ..?

మలయాళ నటి భావన కిడ్నాప్ కేసు మరవని నేపథ్యంలో గాయనిపై ఓలా కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. విధులు ముగించుకుని తెల్లవారుజామున క్యాబ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ గ

Webdunia
గురువారం, 4 మే 2017 (10:58 IST)
మలయాళ నటి భావన కిడ్నాప్ కేసు మరవని నేపథ్యంలో గాయనిపై ఓలా కారు డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. విధులు ముగించుకుని తెల్లవారుజామున క్యాబ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ గాయనిపై అదను చూసుకుని డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే  కామాంధుడి బారి నుంచి గాయని తప్పించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళితే.. గాయని కోరమంగళ నుంచి బేగూరుకు ఓలా క్యాబ్‌లో ఇంటికి బయల్దేరింది. క్యాబ్ డ్రైవర్ రవికుమార్ ఓ ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లాక బొమ్మనహళ్లి సిగ్నల్ దాటిన తరువాత గబుక్కున మరో రోడ్డులోకి పోనిచ్చాడు. అది గమనించిన గాయని రూట్ ఎందుకు మార్చావంటూ ప్రశ్నించింది. ఆ మార్గంలో రోడ్డు సరిగా లేదని చెప్పిన డ్రైవర్ రవికుమార్ కొంతదూరం వెళ్లాక నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపాడు.
 
డోర్ తీసుకుని దిగాక బ్యాక్ డోర్ తీసి గాయని పక్కన కూర్చున్నాడు. ఆమెపై చేయి వేశాడు. గాయని జాగ్రత్తపడి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ పారిపోయాడు.  ఆ సమయంలో సహాయపడేందుకు ఎవ్వరూ లేకపోవడంతో గాయని నడుచుకుంటూ సమీపంలోని లక్ష్మి స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులకు ఫోన్ చేసింది. స్నేహితుల సాయంతో ఈ ఘటనపై బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
గాయని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓలా క్యాబ్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రవికుమార్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఓలా యాజమాన్యం కూడా సమాచారం అందగానే ఈ ఘటనకు పాల్పడిన డ్రైవర్ రవికుమార్ ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments