సీఎం - డిప్యూటీ సీఎంలకు మూడింది.. అన్నాడీఎంకే సర్కారును కూల్చేస్తాం : దినకరన్

ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు మూడిందని, త్వరలోనే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు టీటీవీ దినకరన్ హెచ్చరించ

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:19 IST)
ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు మూడిందని, త్వరలోనే అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ బంధువు టీటీవీ దినకరన్ హెచ్చరించారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, మంగళవారం ఉదయం 10.30 గంటలకు తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుతో భేటీ కానున్నారు. 
 
నిజానికి అన్నాడీఎంకే వైరి వర్గాలు (ఈపీఎస్, ఓపీఎస్) సోమవారం ఒక్కటైన విషయం తెల్సిందే. ఆ తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. దీన్ని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు ఏమాత్రం అంగీకరించడం లేదు. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం విలీనం చెల్లదని టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన చెన్నైలో మాట్లాడుతూ, వారి విలీనం చెల్లదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరామని, గవర్నర్‌ను కలిసి విలీనంపై ఫిర్యాదు చేస్తానన్నారు. తన వద్ద 25 మంది ఎమ్యెల్యేలు ఉన్నారన్నారు. ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తాను చెప్పలేనని చెప్పడం గమనార్హం. 
 
పదవిని కాపాడుకునేందుకు పన్నీర్‌, పళని కలిశారని ఆయన ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యేలు సముఖంగా లేరని ఆయన చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు తమను సంప్రదించి, ఈ విలీనంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని దినకరన్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments