Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నాడీఎంకే పార్టీ సీటుకి ఫీజు రూ. 25,000...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (16:58 IST)
తమిళనాట రెండు ప్రధాన పార్టీలకూ పెద్ద తలకాయలు లేని సమయంలో ఒకవైపు రజినీ మరోవైపు కమల్‌హాసన్‌లు రాజకీయ అరంగేట్రం చేస్తూంటే, అమ్మని ఫోటోలో మాత్రమే పెట్టుకొని అమ్మ లేకుండా తొలిసారిగా ఎన్నికలలోకి అడుగిడబోతున్న అన్నాడీఎంకే దరఖాస్తు ఫీజుల పేరిట వసూళ్ల పర్వానికి తెరలేపింది.
 
తమిళనాడు, పుదుచ్చేరి నుండి లోక్‌సభ టిక్కెట్లను ఆశించే వారి నుండి దరఖాస్తులను అన్నాడీఎంకే పార్టీ ఆహ్వానించింది. అయితే ఆశావహులు దరఖాస్తు ఫీజుగా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుందని ఇందుమూలంగా తెలియజేసింది. ఇందుకుగానూ ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని బుధవారంనాడు అన్నాడీఎంకే కో-ఆర్డినేటర్ పన్నీర్ సెల్వం, జాయింట్ కో-ఆర్డినేటర్, ముఖ్యమంత్రి కె.పళనిస్వామిలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేసారు. 
 
కాగా తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, పుదుచ్చేరిలో ఒక లోక్‌సభ స్థానం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 గెలుచుకుంది. మరి ఈసారి ఎన్ని గెలుచుకోనుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments