Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారుపై శునకం కూర్చొందనీ... తుపాకీతో కాల్చి చంపిన కసాయి

Webdunia
గురువారం, 14 మే 2020 (12:00 IST)
గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తాను ఎంతో ఇష్టపడి కనుక్కొన్న కారుపై ఓ కుక్క కూర్చొంది. ఈ దృశ్యాన్ని చూసిన ఆ కారు యజమానికి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దుశ్చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని రానిప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బహుళ అంతస్తు భవన సముదాయంలో జిగర్‌ పంచాల్‌ (35) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈయన ఎంతో ఇష్టపడి ఓ కారును కొనుగోలు చేసి, ఆ ప్రాంగణం వెలుపల పార్కింగ్ చేశాడు.
 
అయితే, ఓ వీధి శునకం ఆ కారుపై కూర్చొంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. దీన్ని చూసిన పంచాల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుక్కపై గురిపెట్టి కాల్చిచంపాడు. 
 
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రానిప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచాల్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగిటివ్‌ తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments