Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, రూ.3.20లక్షలు గోవిందా!

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (15:24 IST)
ఆగ్రాలోని బఝేరా ప్రాంతం అచ్నేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్ళారు. ఈ ఘటనపై ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. బఝేరా ప్రాంతానికి నివసిస్తోన్న కేలాల్, అతడి కుమారుడు లవకుష్ రాత్రివేళ ఇంటి బయట వరండాలో నిద్రపోయారు. అయితే పడుకునే ముందు వారు అనుకోకుండా ఇంటి తలుపులకు తాళం వెయ్యడం మర్చిపోయారు. 
 
ఇదే అదనుగా చేసుకున్న దొంగలు.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించి.. అల్మారాలో ఉన్న సుమారు యాభై తులాల బంగారం, 2.5 కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఇక తెల్లారి లేచి చూసేసరికి.. గది తలుపులు తెరిచి ఉండటాన్ని తండ్రీకొడుకులు గుర్తించారు. 
 
లోపలికి వెళ్లి చూడగా అరలోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments