సాయుధ బలగాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు రోడ్లెక్కారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో హింసాకాండ, ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పేరుతో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగింది.
ఈ పథకానికి వ్యతిరేకంగా యువకుల ఆందోళనలకు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ సత్యాగ్రహ దీక్షను మొదలుపెట్టింది.
ఇందులో ప్రియాంకా గాంధీతో పాటు ఆ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ సభ్యులు, ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు దీక్షలో కూర్చొన్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు పెట్టుకుని నినాదాలు చేస్తున్నారు. మరోవైపు, జంతర్ మంతర్ వద్ద భారీ సంఖ్యంలో పోలీసు బలగాలను మొహరించారు.
ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టారు. బ్రిటీష్ పాలకుల పోలీసులు,స లాఠీలు బ్యారికేడ్రను గాంధీజీ సత్యాగ్రహాన్ని ఆపలేకపోయాయని గుర్తుచేశారు. ఇపుడు అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశంలో సాగుతున్న సత్యాగ్రహాన్ని ఆపగలరా అని ప్రశ్నించింది.