Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌ కలకలం: వ్యక్తి మృతి

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (16:24 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌ కలకలం రేపుతోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఆందోళన రేపిన ఆందోళన ఇంకా సమసిపోకముందే యూపీలో కరోనా కొత్త వేరియంట్‌ 'కప్పా' పాజిటివ్‌ నిర్ణారణ అయిన 66 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇతడిని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లా నివాసిగా అధికారులు గుర్తించారు.
 
జూన్ 13 న రొటీన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలో భాగంగా సేకరించిన నమూనాలో దీన్ని గుర్తించారు. అనంతరం వీటి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీకి పంపించారు. 
 
మే 27 న కోవిడ్ -19 కు పాజిటివ్ నిర్ధారణ కాగా, జూన్ 12 న గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీకి తరలించామని, అక్కడ చికిత్స పొందుతూ జూన్ 14న కన్నుమూశాడని కాలేజీ మైక్రోబయాలజీ విభాగం అధిపతి అమ్రేష్ సింగ్ ధ్రువీకరించారు. 
 
అయితే బాధితులకు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకపోవడం గమనార్హం. అంతకుముందు యూపీలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులను గుర్తించగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments