Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌర కుటుంబం అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. ముహూర్తం ఫిక్స్

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (16:07 IST)
సౌర కుటుంబ అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 పేరుతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ నెల 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3ని విజయవంతంగా దించింది. ఫలితంగా అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది. ఇపుడు అదే ఉత్సాహంతో సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇందుకోసం సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్‌ 1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు.
 
'సెప్టెంబరు 2న ఈ ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయి' అని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)కు తీసుకొచ్చారు. పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక.. ఆదిత్య-ఎల్‌ 1ను మోసుకుని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.
 
కాగా, సౌర కుటుంబ అధ్యయనం కోసం ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌‌ను నింగిలోకి పంపించనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (ఎల్‌ 1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments