Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయులు, కెమిస్ట్‌ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (14:19 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు.. ఓ కెమిస్ట్‌ను అతి దారుణంగా చంపేశారు. మృతుల్లో ఒక మహిళా టీచర్ కూడా ఉన్నారు. ఒక‌రు క‌శ్మీరీ పండిట్ కాగా, మ‌రొక‌రు సిక్కు మ‌హిళ‌గా గుర్తించారు. 
 
శ్రీన‌గ‌ర్ జిల్లాలోని సంఘం ఈద్గా వ‌ద్ద ఇద్ద‌రు స్కూల్ టీచ‌ర్ల‌ను ఉద‌యం 11.15 నిమిషాల‌కు హ‌త‌మార్చారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతాన్ని మూసివేశామ‌ని, ఉగ్ర‌వాదుల కోసం అన్వేషిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
మరోవైపు, ఈ హత్యలను నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత‌, మాజీ సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా ఖండించారు. అనాగ‌రిక చ‌ర్య‌కు టీచ‌ర్లు బ‌ల‌య్యార‌ని, వారి ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు ఒమ‌ర్ ఓ ట్వీట్ చేశారు.
 
మంగ‌ళ‌వారం కూడా ఉగ్ర‌వాదులు ఓ కాశ్మీరీ పండిట్‌ను చంపిన విష‌యం తెలిసిందే. శ్రీన‌గ‌ర్‌లోని ఇక్బాల్ పార్క్‌లో ఉన్న ఓ ఫార్మ‌సీ షాపు ఓన‌ర్ 70 ఏళ్ల మ‌ఖ‌న్ లాల్ బింద్రూను ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు. 
 
అలాగే, ఉగ్ర‌వాదుల కాల్పుల్లో మంగ‌ళ‌వారం మృతిచెందిన వారిలో ఓ వీధి వ్యాపారి ఉన్నాడు. బండిపురాలో ట్యాక్సీస్టాండ్ అధ్య‌క్షుడు మ‌హ‌మ్మ‌ద్ ష‌ఫీని కూడా ఉగ్ర‌వాదులు చంపేశారు. వీధి వ్యాపారిని బీహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌గా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments