Webdunia - Bharat's app for daily news and videos

Install App

పశ్చిమ బెంగాల్‌లో విజృంభిస్తున్న అడెనో వైరస్..

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (17:08 IST)
Adeno Virus
పశ్చిమ బెంగాల్‌లో మరో ప్రమాదకర వైరస్ విజృంభిస్తోంది. అడెనో వైరస్ ప్రభావంతో పలువురు చిన్నారులతో పాటు పెద్దలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది.
 
చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు జిల్లాలకు సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది. 
 
పశ్చిమ బెంగాల్‌లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్క రోజే 115 మంది పేషెంట్లు ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరారు. 
 
పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. చాలా మంది నాన్ కోవిడ్ కరోనా వైరస్, ఇన్‌ఫ్లుయెంజా, పారా ఇన్‌ఫ్లుయెంజా, రైనో వైరస్, న్యూమోకాకస్ అండ్ ఆర్ఎస్‌వీ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ తెలిపింది.
 
చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఐసీయూ/హెచ్‌డీయూలో చికిత్స పొందుతున్నారు. అడెనో వైరస్ సోకిన వారిని కూడా కోవిడ్ మాదిరిగానే స్వాబ్ ద్వారా పరీక్షించి, నిర్ధరిస్తారు. అడెనో వైరస్ సోకితే ప్రధానంగా కళ్లు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. 
 
తర్వాత శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులపై ప్రభావం ఉంటుంది. డయేరియా కూడా రావొచ్చు. చిన్నారులు త్వరగా, ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments