Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కస్తూరీ ఫైర్.. చెర్రీ ట్వీట్ వైరల్

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (15:03 IST)
సనాతన ధర్మాన్ని రద్దు చేయాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రసంగంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నటి, సామాజిక కార్యకర్త కస్తూరి ఉదయనిధి స్టాలిన్‌పై విమర్శలు గుప్పించారు. 
 
"మీ కుటుంబంలో డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతాయి. మీరు వాటితో ఏమి చేయాలనుకుంటున్నారు? సనాతనపై అంత ద్వేషం ఉన్నవారికి, హిందూ దేవాలయాల ఆస్తుల్లో పనేంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
సనాతన వ్యతిరేకతలో భాగమైన డీఎంకే ముందుగా ఇండియా కూటమి నుంచి వైదొలగాలి. ఎందుకంటే చాలామంది సనాతన వాదులు ఆ కూటమిలో ఉన్నారంటూ కస్తూరి గుర్తు చేశారు. 
 
ఇంకా ఉదయనిధి స్టాలిన్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తోంది. పలు చోట్ల ఉదయనిధి స్టాలిన్‌పై కేసులు కూడా పెట్టారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో హిందూవాదులు సైతం ఉదయనిధి స్టాలిన్‌పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.
 
తన తల్లి సురేఖ కొణిదెల ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫొటోను ట్వీట్ చేసిన రామ్ చరణ్.. "మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత" అని పేర్కొన్నారు. 2020 సెప్టెంబర్ 11న చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments