రౌడీ ఎమ్మెల్యే.. యువతులను వేధించాడనీ దొడ్డు కర్రతో చితకబాదాడు

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (17:21 IST)
ఎవరైనా తప్పు చేస్తే తొలుత హెచ్చరిస్తారు. మాట వినకుంటే పోలీసులకు పట్టిస్తారు. అదే ఒక ప్రజా ప్రతినిధి అయితే, తన అధికారాన్ని ఉపయోగించి తక్షణం అరెస్టు చేయిస్తాడు. కానీ, ఇక్కడ ఆప్ ఎమ్మెల్యే అలా చేయలేదు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. యువతులను వేధించాడన్న కోపంతో ఓ వ్యక్తిని గొడ్డును బాదినట్టు చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలోని కిరారీ ప్రాంతానికి చెందిన వికాస్ అనే యువకుడు యువతులను వేధిస్తున్నాడనే ఆరోపణలతో ఆప్ ఎమ్యెల్యే సౌరవ్ ఝా.. అతడిని చితకబాదాడు. దొడ్డు కర్ర చేత పట్టుకుని వికాస్‌ని చావబాదాడు. పక్కన పోలీసులు ఉన్నప్పటికీ ఆ ప్రజాప్రతినిధి రెచ్చిపోయాడు. 
 
ఎమ్యేల్యేనే రెచ్చిపోతే తామెందుకు ఎందుకు కొట్టవద్దని అనుకున్నారో ఏమో అక్కడున్నవారు.. వారు కూడా కర్రలు చేత పట్టుకుని వికాస్‌ని చితకొట్టారు. బాధలు భరించలేని వికాస్ అరుపులు పెట్టాడు. అయినా వారు కనికరించలేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వికాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నవంబరు 14వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments