Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్ కార్డుదారులకు ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (08:19 IST)
'ఆస్క్ ఆధార్' పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఛాట్‌బాట్ సర్వీస్... అంటే ఆధార్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను ఛాట్‌బాట్ సర్వీస్ ఉపయోగించుకుని పరిష్కరించుకోవచ్చు.
 
మీరు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేస్తే ఛాట్‌బాట్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి సమస్యను వివరించవచ్చు. ఆధార్ అప్‌డేట్ సమాచారం, ఆధార్ స్టేటస్, డౌన్‌లోడ్ ఇ ఆధార్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్... ఇలా ఎలాంటి అంశాలనైనా ప్రస్తావించవచ్చు. 
 
‘ఆధార్‌’కు సంబంధించిన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. ఆధార్‌కు సంబంధించిన వీడియోలు, సంబంధిత టాపిక్స్ కూడా ఇదే విండోలో చూడొచ్చు.
 
ఇదిలా ఉంటే... ఆధార్‌కు సంబంధించి యూఐడీఏఐ మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 125 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది యూఐడీఏఐ. ఆధార్ కార్డును ప్రాథమిక గుర్తింపు కార్డుగా ఉపయోగించడం పెరిగిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 
 
ఆధార్ సర్వీస్ ప్రారంభించినాటి నుంచి 37 వేల కోట్ల సార్లు ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ జరిగినట్టు లెక్కలున్నాయి. అంతేకాదు... ప్రతీరోజు ఆధార్ ఆథెంటికేషన్ కోసం మూడు కోట్ల రిక్వెస్ట్‌లు యూఐడీఏఐకు వస్తున్నాయి. ఇప్పటి వరకు 331 కోట్ల ఆధార్ అప్‌డేట్స్ జరిగాయి. ఆధార్ అప్‌డేషన్ కోసం ప్రతీ రోజు 3 నుంచి 4 లక్షల వరకు రిక్వెస్ట్‌లు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments