Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ కాలు విరిగినా. ఆ గుండె నిబ్బరం అదుర్స్.. జయా బచ్చన్

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:04 IST)
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తల పగిలినా, కాలు విరిగినా ఆమె గుండె నిబ్బరంగానే ఉందని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్‌ తెలిపారు. టీఎంసీకి మద్దతుగా ప్రచారం కోసం సోమవారం ఆమె కోల్‌కతా వచ్చారు. మమత తల పగులగొట్టారు, కాలు విరగొట్టారు కానీ వారు (బీజేపీ నేతలు) ఆమె గుండె, మెదడును దెబ్బతీయలేకపోయారని విమర్శించారు.
 
ముందుకు సాగాలని, బెంగాల్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చేయాలనే మమత సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేకపోయారని దుయ్యబట్టారు. మమతా జీ ఏమి చేయాలనుకున్నా ఆమె అది చేస్తారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
 
టీఎంసీకి మద్దతుగా ఇక్కడకు వెళ్లాలని తమ పార్టీ నేత అఖిలేస్‌ యాదవ్‌ కోరారని జయా బచ్చన్‌ తెలిపారు. అన్ని దారుణాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఒంటరి మహిళ అయిన మమతా జీ పట్ల తనకు చాలా ప్రేమ, గౌరవం ఉందన్నారు. 
 
మరోవైపు బెంగాల్‌కు జయా బచ్చన్‌ రాకను తాను స్వాగతిస్తున్నట్లు బీజేపీ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో తెలిపారు. ఆమె తనకు చాలా తెలుసని, కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడబోనని చెప్పారు. జయా బచ్చన్‌ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవచ్చని, అయితే ఎప్పుడూ కూడా తనకు వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments