Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ అంటే.. ఫుల్ ఆఫ్ వార్ కాదు.. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ కూడా..?

Advertiesment
బిగ్ బాస్ అంటే.. ఫుల్ ఆఫ్ వార్ కాదు.. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ కూడా..?
, బుధవారం, 18 నవంబరు 2020 (18:43 IST)
బిగ్ బాస్ అంటే ఎప్పుడూ ఫుల్ ఆఫ్ వార్ కాదు అప్పుడప్పుడూ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అని ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో బాగానే వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..? ప్రతీ సీజన్ మాదిరే ఈ సారి కూడా బిగ్ బాస్ ఇంటికి సొంత వాళ్లను పిలిపించారు. ఇంటి సభ్యుల అమ్మలను తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆనందం కనిపించింది. 
 
చిందులేస్తూ కేకలేస్తూ ఉండిపోయారు ఇంటి సభ్యులు ఇప్పటికే ఇంట్లో ఓ టాస్క్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో అఖిల్, అభిజీత్, హారిక గెలిచి వచ్చే వారం కెప్టెన్సీ టాస్కులో పోటీ దారులుగా నిలబడ్డారు. మళ్లీ తమ టాస్కు చేస్తున్న క్రమంలోనే ఇంట్లోకి వచ్చేసారు వాళ్ల ఇంటి సభ్యులు. ముందుగా ఇంట్లోకి వచ్చిన హారిక తల్లిని చూసి అంతా షాక్ అయ్యారు. ఇక హారిక అయితే నిలబడిన చోటే ఏడ్చేసింది. ఆ తర్వాత అభిజీత్ మదర్ వచ్చారు. తన కొడుకుకు సపోర్ట్ ఇవ్వడమే కాకుండా అందరితోనూ కలిసిపోయింది.
 
ముఖ్యంగా అఖిల్, అభి మధ్య గొడవ గురించి చెప్పుకొచ్చింది. ఇక్కడంతా గేమ్ కోసమే ఆంటీ.. ఎవరం శత్రువులం కాదంటే కొట్టుకోండి పర్లేదు అంటూ చెప్పింది అభి తల్లి. ఇక వెంటనే అఖిల్ తల్లి వచ్చింది. ఆమెను చూడగానే మమ్మీ అంటూ ఏడ్చేసాడు అఖిల్. అవినాష్ వాళ్ల మదర్ ఏకంగా డాన్సులు కూడా చేసింది. ఊరికే పెళ్లి గురించి టెన్షన్ పడుతున్నాడంటే.. బయటికి వచ్చిన వెంటనే చేస్తానులే నాన్న అంటూ అవినాష్ వాళ్ల అమ్మగారు చెప్పారు. ఆ తర్వాత వాళ్లందరూ వెళ్లిపోయాక ఒక జోడీలా మారిపోయి డాన్సులు చేసారు ఇంటి సభ్యులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ - గోపీచంద్ కాంబినేషన్లో మల్టీస్టారర్..?