Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ పెట్టుకోమంటే కానిస్టేబుల్ చెంప పగులకొట్టిన యువకుడు!

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (15:01 IST)
Police
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. తాజాగా ఓ యువకుడు మాస్క్‌ పెట్టుకోలేదని ఆడిగినందుకు కానిస్టేబుల్‌ చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్‌లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్‌స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్‌స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని చెబితే ఎందుకంత నిర్లక్ష్యం ఏంటి'' అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు. 
 
దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్‌ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్‌స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్‌స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్‌కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments