Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణాలు ఫణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి బహుమతి..

ప్రాణాలు ఫణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి బహుమతి..
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (19:13 IST)
ఇటీవల ముంబై రైల్వే స్టేషనులో ప్లాట్‌ఫామ్ పైనుంచి ప్ర‌మాద‌వ‌శాత్తూ ప‌ట్టాల‌పై ప‌డిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి (పాయింట్స్ మెన్) తన ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడాడు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన ఆ వీడియో వైర‌ల్ అయిపోయింది. 
 
ఈ ఒక్క సాహసంతో మ‌యూర్ షెల్కె అనే ఆ రైల్వే ఉద్యోగి ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరో అయిపోయాడు. రైల్వే ఇప్ప‌టికే అత‌నికి రూ.50 వేలు బ‌హుమ‌తిగా ఇస్తే.. అందులో స‌గం ఆ చిన్నారికే ఇస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌యూర్ మ‌రింత మంది మ‌నుసులు గెలుచుకున్నాడు. 
 
తాజాగా జావా మోటార్‌సైకిల్స్ కోఫౌండ‌ర్ అనుప‌మ్ త‌రేజా అత‌నికి ఖరీదైన బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చిన‌ట్లే మ‌యూర్‌కు బైక్ ఇచ్చిన‌ట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్‌ను మ‌యూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ క‌ల‌ర్‌లో ఉన్న ఈ బైక్ ధ‌ర రూ.ల‌క్ష‌న్న‌రకు పైనే కావ‌డం విశేషం. జావా ఫార్టీ టూ బైక్‌ను ఈ మ‌ధ్యే లాంచ్ చేశారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా కల్లోలం... పీడిస్తున్న మందుల కొరత... సీఎం జగన్ ఫోన్