Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అనుమతి లేకుండా నన్నెందుకు కన్నారు? తల్లిదండ్రులపై యువకుడు కేసు...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (14:49 IST)
ఇలాంటి ప్రశ్న మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా అడిగారా, అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? కానీ 27 ఏళ్ల ఒక ముంబై యువకుడు మాత్రం తల్లిదండ్రులు తనను స్వార్థం కోసం మాత్రమే కన్నారని కోర్టులో కేసు వేసాడు. అంతేకాకుండా పలువురి కళ్లు తెరిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రఫెల్ శ్యామ్యూల్ అనే ముంబై యువకుడు యాంటీ-నటలిజం అనే పేరు మీద ఒక గ్రూప్‌ని సృష్టించాడు. 
 
సమాజానికి పిల్లలు అవసరం లేదు, వాళ్లని కని భూమి మీదకు తెచ్చి కష్టాలు పాలుచేస్తున్నారు. వారి ఆనందం, ఆసరా కోసం ఆస్తులను కాపాడుకోవడం కోసం వారిని కని పెళ్లి పిల్లల పేరుతో ఇబ్బందులలో పడేస్తున్నారని ఇతని భావన. బొమ్మలను చూసి ఆనందించినట్లే పిల్లలను కూడా కని వారితో ఆడుకుంటున్నారని, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారని అతని ఆవేదన. 
 
కానీ శ్యామ్యూల్‌కి మనం అనుకుంటున్నట్లు కష్టాలు ఏమీ లేవు. అతని తల్లిదండ్రులు అతనికి మంచి లైఫ్ ఇచ్చారని, తాను ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నానని చెప్పుకొస్తున్నాడు. కానీ వారు నన్ను కని కష్టాలలోకి నెట్టారు. పిల్లలను అనుమతి లేకుండా కనడమే కాకుండా భార్య, భర్తలు, పిల్లలు అంటూ బానిసలుగా మార్చే హక్కు వారికి ఎవరు ఇచ్చారు అని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు దోషులేనని, ఎవరూ ఇలాంటి జీవితం గడపవద్దని నిహిల్ ఆనంద్ పేరుతో యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో అందరికీ హితబోధ చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments