Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యను ప్రేమించాడు.. ఆమె నో చెప్పడంతో ఏం చేశాడంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (15:34 IST)
పవిత్రమైన ప్రేమను అవసరాల కోసం వాడుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ప్రేమకు వయోబేధం లేకుండా పోతుంది. అంతేగాకుండా వావివరుసలు కూడా కనుమరుగు అవుతున్నాయి. ప్రేమ పేరుతో నేరాలు మోసాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడొక్కడు తన స్నేహితుడిని భార్యను ప్రేమించాడు. ఆమె లేకపోతే బతకనని చెప్పాడు. చివరికి ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని సమీపంలోని కోట్ల ముబారక్‌పూర్‌కి చెందిన విక్కీ నార్త్ ఢిల్లీలోని నరేలా ప్రాంతానికి చెందిన వివాహితను ప్రేమించాడు. అయితే లాక్ డౌన్ పేరుతో ప్రజలు ఇళ్లకు పరిమితమైనా ఆమె కోసం ఇంటికే వెళ్లాడు. 
 
దాంతో ఆమె ఇంటికి వెళ్లి తనతో బయటకు రావాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లి తనతో మాట్లాడి ఇంటి బయటకు వచ్చిన విక్కీ నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎడమ భుజం కింద కాల్చుకుని కుప్పకూలిపోయాడు. విక్కీ ప్రేమను ఆమె తిరస్కరించడంతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
విక్కీ ఆమె భర్త స్నేహితుడని.. అప్పుడప్పుడూ వాళ్లింటికి వచ్చి వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న విక్కీ ప్రియురాలి ఇంటి నుంచి బయటికొచ్చి తుపాకీతో కాల్చుకున్నాడని చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. 
 
పోలీసుల విచారణలో విక్కీ ప్రపోజ్ చేసిన స్నేహితుడి భార్య కోసం 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాడని.. విక్కీ స్నేహితుడు ప్రస్తుతం జైలులో వున్నాడని.. ఈ క్రమంలోనే స్నేహితుడి భార్యకు సన్నిహితం కావాలనుకున్నాడని తెలిసింది. ఇందుకు ఆమె నిరాకరించిందని, తనకు వివాహమైపోయిందని చెప్పడంతో నాటు తుపాకీతో కాల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments