Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి వజ్రాల వ్యాపారి.. జీవితంపై విరక్తి చెంది. 9 యేళ్లకే సన్యాసం ... ఎక్కడ?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (09:04 IST)
ఆమె తండ్రి ఓ వజ్రాల వ్యాపారి. కోటీశ్వరుడు. సుసంపన్నమైన కుటుంబం. కానీ, ఆ చిన్నారికి మాత్రం ఆ సిరిసంపదలంటే ఏమాత్రం ఇష్టం లేదు. లగ్జరీ జీవితంపై అస్సలే మోజు లేదు. అందుకే తొమ్మిదేళ్ల ప్రాయంలోనే సన్యాసం స్వీకరించి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
సూరత్‌కు చెందిన ధనేష్ అనే వజ్రాల వ్యాపారి ఉన్నారు. ఈయన భార్య అమీ సంఘ్వీ. మూడు దశాబ్దాలుగా వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. వజ్రాలను పాలిష్ చేయడం, వాటిని ఎగుమతి చేసే వ్యాపారం. ఈ దంపతులకు దేవాన్షి అనే తొమ్మిదేళ్ల బాలిక ఉంది. చిన్నవయస్సు నుంచే ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉండేవి. అందుకే ఆ బాలిక ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి పెంచుకుంది. చివరకు సన్యాసం స్వీకరించాలని భావించింది. తన మనస్సులోని మాటను తల్లిదండ్రులకు చెప్పింది. వారు తొలుత ససేమిరా అనప్పటికీ ఆ తర్వాత కుమార్తె పట్టుదలకు తలొగ్గారు. 
 
ఆ తర్వాత జైన సన్యాసి ఆచార్య విజయ కార్తియాశ్సూరి సమక్షంలో ఆ చిన్నారి బుధవారం సన్యాసి దీక్షను స్వీకరించింది. ఈ దీక్ష తీసుకోవడానికి ముందు ఇతర సన్యాసులతో కలిసి ఏకంగా 700 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసింది. ఈ తొమ్మిదేళ్ళ బాలిక ఐదు భాషల్లో సరళంగా మాట్లాడగలదు. ఈ బాలిక సన్యాసి స్వీకరణ కార్యక్రమానికి చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మంది తరలిరావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments